ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడే దెన్నడు ?

ఆధారాలు చూపినా చర్యలు లేవా ? ప్రశ్నించిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి

ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడే దెన్నడు ?

    ఆధారాలు చూపినా చర్యలు లేవా ?

ప్రశ్నించిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి

 

హైదరాబాద్ ఫిబ్రవరి 27 (మీడియా ఫోకస్ );ప్రభుత్వ ఉపాద్యాయులై ఉండి ప్రైవేటు వ్యాపారాలు వెలగ పెడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్తను కొందరు భ్రష్టు పట్టిస్తున్నారని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి పేర్కొంది.ఆధారాలతో పిర్యాదు చేసినా విచారణల పేరుతో తూతూ మంత్రంగా కాలయాపన చేస్తూ వ్యవహరిస్తున్న అధికారుల తీరు విద్యా వ్యవస్తను భ్రష్టు పట్టించడంలో 'తిలా పాపం తలా పిడికెడు" అన్నట్టుగా ఉందని విద్యా పరిరక్షణ కమిటి నేతలు తిరువరంగం ప్రభాకర్,సిహెచ్ మధుసూదన్ రెడ్డి,కటంగూరు సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ పర్యవేక్షణ లోపం, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో అధికారుల అలసత్వం వెరసి ప్రభుత్వ విద్యావ్యవస్థ నానాటికి దిగజారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేసారు. ఏకంగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం స్వంత జనగామ జిల్లా లోని పాలకుర్తి మండలంలోని ఎంపీపీఎస్ 'కంబాలకుంట తండా' లో పని చేస్తున్న ఉపాద్యాయుడి వ్యవహారం ఆదినుండి వివాదాస్పదమే. అతని అప్పాయింట్ మెంట్ కూడా సందేహాస్పదమే. ఇనుగాల దేవేందర్ రెడ్డి అనే అతనుఅతడి తండ్రి పేరు వెంకట రెడ్డా? లేక సంజీవ రెడ్డా? ఏది నిజం? ఏది చట్టసమ్మతం? ఇతనికి ఏ తండ్రి పేరుతో ఉద్యోగం లభించిందని వారు ప్రశ్నించారు.ఒక ప్రభుత్వ ఉద్యోగి గాని, అతని సంబందికులు గాని 'కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమనిబంధనల ప్రకారం ఎలాంటి ప్రైవేటు వ్యాపారాలు చేయరాదు. కాని అతడి కుటుంబీకులతో పాటు అతను అనునిత్య కృత్యాలు, యవ్వారాలు వెలగబెడుతున్నది ఓ రెండు రిజిస్టర్డ్ ప్రైవేటు ప్రైవేటు విద్యా వ్యవస్థలలో, అందులో ఒకటి "విభావిని విద్యా సమితి, మడికొండ (రి.నం. 540/1991, తేది: 19.02.1991)". ప్రభుత్వ ఉపాధ్యాయుడయివుండీ ఫాదర్ ఇనుగాల సంజీవ రెడ్డి పేరుతో, గత 25 సంవత్సరాలుగా వరంగల్ జిల్లా కోర్టులో రెండు కేసులు, హైద్రాబాద్ హై కోర్టులో రెండు కేసులలో కీలక వ్యక్తి గా ఉన్నట్లు వారు తెలిపారు.మరొకటి " ఎస్ఎల్ఎన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, హనుమకొండ (రి.నం.89/2002, తేది: 06.01.2016)" యందు, తన ఫాదర్ ఇనుగాల వెంకట రెడ్డి పేరుతో ఎగ్జిక్యూటివ్ మెంబర్, అతడి భార్య ఇనుగాల అరుణ ప్రధాన కార్యదర్శి, అతడి పెద్ద కుమారుడు ఇనుగాల అమితేశ్ రెడ్డి ఉపాధ్యక్షుడు, చిన్న కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి మరో ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఇద్దరు కొడుకులు విదేశంలో నివసిస్తూ "SLN ఎడ్యుకేషనల్ సొసైటీ, హనుమకొండ"లో కార్యనిర్వాహక కమిటీ సభ్యులన్నారు.ఆధార్, ఓటరు, డ్రైవింగ్ లిసిఒన్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులు ఏ ఫాదర్ పేరుతో జారీ చేయబడినవి? ప్రభుత్వ పరంగా పొందే జీతభత్యాలు, ప్రభుత్వ రాయితీలు, ఏ బ్యాంకు అకౌంట్స్ ద్వారా, ఏ ఫాదర్ పేరున పొందుతున్నట్లు? ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిజేస్తూ, ప్రైవేటు విద్యా సంస్థలలో, కోర్టు కేసులలో ఇద్దరు ఫాదర్స్ పేరుతో చలామణి కావడం ఇతడికి మాత్రమే ఎలా చెల్లుతోందని వారు ప్రశ్నించారు.విద్యార్థులనమోదు శాతాన్ని పెంచి, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన సదరు ఉపాద్యాయుడు ఏళ్లతరబడి బదిలీలు లేక ఒకే పాఠశాల లో పాతుకు పోయి గొర్రెల, కోళ్ళ పెంపకాన్ని మాత్రం ఇష్టంగా నిర్వహిస్తాడనేది తండా వాసులు చెబుతారు. పాలకుర్తి మండలంలోని ఎంపీపీఎస్, 'కంబాలకుంట తండా పాఠశాల లో కేవలం 16 మంది విద్యార్థులు నమోదు, హాజరు మాత్రం 10 దాటదు. G.O.M.S. No. 25 Dt. 12.08.2021 ననుసరించి అక్కడ ఒక్క ఉపాద్యాయుడే అవసరం, కానీ ఇక్కడ ఇద్దరు ఉపాద్యాయులు అధికారుల అండదండలతో వంతులవారిగా విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు.డిఎస్సి 1996లో ఎస్జిటి గా నియామక తేది: 23.03.1998. ప్రస్థుత పాఠశాలలో తేది: 23.05.2011 నుండి పని జేస్తున్నట్లుగా అధికారిక రికార్డు. అక్కడ అతడి వృత్తి ధర్మాన్ని 'కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమనిబంధనల ప్రకారం, చట్టబద్ధంగా ఏ మేరకు నిర్వర్తిస్తున్నట్లు? ఎందరు టీచర్లు? ఎందరు విద్యార్థులు? ప్రభుత్వ పరంగా ప్రత్యేక కమిటీ లేదా నిఘా వర్గాలతో స్థానికంగా సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.గౌరవ ప్రదమైన విద్యావ్యవస్థ ఉనికిని పరిరక్షించడం సర్వజన సమ్మతమౌతుంది. భవిష్యత్ బాలబాలికలకు మార్గదర్శకంగా నిర్వహించాల్సినవిద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేసారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం.
నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. అకాల వర్షాల వర్షంతో కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు.   నిజామాబాద్‌ ఏప్రిల్ 13 (మీడియా ఫోకస్ );: నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వర్షం...
బోర్న్ విటీ హెల్త్ డ్రింక్స్ కేటగిరి లోకి రాదు.
పాకిస్థాన్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు..
వైఎస్ షర్మిల పర్యటనలో ఉద్రిక్తత..
ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.
ఫ్యామిలీ వీసాకు వార్షిక ఆదాయ పరిమితిని 55 శాతానికి పెంపు.
గత నెల 16 నుంచి జిల్లాలో ఇప్పటి వరకు రూ.13,33,19,960 నగదు సీజ్