అల్జీమర్స్ కు జాగ్రత్తగా ఉండండి ఇలా - డాక్టర్ లిల్లీ మేరి

అల్జీమర్స్ కు జాగ్రత్తగా ఉండండి ఇలా - డాక్టర్ లిల్లీ మేరి

అల్జీమర్స్ కు జాగ్రత్తగా ఉండండి ఇలా - డాక్టర్ లిల్లీ మేరి

 

సిద్దిపేట జూలై 4 (మీడియా ఫోకస్ );: అల్జీమర్స్ కు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి సూచించారు.మాజీ కేంద్రమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్, మాజీ ఐఏఎస్ అధికారి చాలా కాలం పాటు ప్రజలకు సేవలు అందించిన జన్నత్ హుస్సేన్ లాంటివారు ఆల్జీమర్స్ తో బాధపడ్డారు. ఇటీవల కాలంలో ఇలా ఆల్జీమర్స్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. మనిషి జ్ఞాపకాలను మాయం చేసి, మెదడు పనితీరును దారుణంగా దెబ్బతీసే వ్యాధి ఇది. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న అధ్యయనాల ప్రకారం ఒక శాతం కేసులో మాత్రమే ఆల్జీమర్స్ జన్యుపరంగా సంక్రమిస్తుంది. మిగిలిన 99 శాతం కేసుల్లో మెదడులో వచ్చిన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే ఆల్జీమర్స్ ఒక్కసారిగా వచ్చి మీద పడిపోదు. క్రమేపీ మెదడు పనితీరు దెబ్బ తింటూ ఉంటుంది. ఈ క్రమంలో కనిపించే లక్షణాలను చాలా మంది పట్టించుకోరు. వృద్ధాప్యం వల్ల వచ్చే మతిమరుపు అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. బీపీ, మెదడు వాపు వ్యాధి వంటివి వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోకపోతే వారికి వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ ముప్పు ఉంటుందని లిల్లీ మేరి పేర్కొన్నారు. తగ్గటానికి మందులు అందుబాటులో లేవని, మేనేజ్ చేయడానికి మాత్రమే మందులు ఉపయోగిస్తారని డాక్టర్ లిల్లీ మేరి వివరించారు.

 

అల్జీమర్స్ అంటే?

 

 మనిషి అంటే.. వట్టి శరీరమే కాదు. అనుభవాలు, మేదస్సు, జ్ఞాపకాల సమాహారం. రకరకాల కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొని రాడ్ తేలి విస్తృత అనుభవాన్ని సంపాదించిన ఒక మనిషి. ఆ అనుభవాలను జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోతే! భార్యా పిల్లలను సైతం గుర్తుపట్టలేనంతగా అయిపోతే! సంత పేరు.. ఉండే ఊరు.. చిరునామా.. అన్ని ఆ మెదడు లోంచి కాళీ అయిపోతే? ఆ పరిస్థితిని వైద్య పరిభాషలో ఆల్జీమర్స్ అంటారు. వయసు పెరిగే కొద్దీ కొందరికి మతిమరుపు రావటం సహజమే. అలాంటివారికి వారు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తే వెంటనే గుర్తొస్తుంది. అల్జీమర్స్ బాధితుల మతిమరుపు అలా కాదు. వారికి ఏదైనా విషయం గుర్తు చేసినా.. మరో నిమిషమే మళ్లీ మర్చిపోతారు. ఒకే విషయాన్ని పదే పదే మాట్లాడతారు. ఒకే ప్రశ్న పదేపదే వేస్తారు. దీనికి కారణం వారి మెదడు సామర్థ్యం క్రమేపి సన్నగిల్లిపోతుండటమే. ఆల్జీమర్స్ బాధితుల జ్ఞాపక శక్తి నానాటికి తగ్గిపోతుంది. ఆలోచించే సామర్థ్యం నశిస్తుంది. 1906లో జర్మనీకి చెందిన డాక్టర్ అలో ఈజ్ అల్జీమర్స్ అనే వైద్యుడు ఈ వ్యాధిని తొలిసారి గుర్తించారు. అసాధారణ మతిమరుపు, భాషా సమస్యలు అనూహ్య ప్రవర్తనతో బాధపడుతున్న ఒక మహిళ చనిపోయాక ఆమె మెదడుపై పరిశోధన చేశారు. ఆమె మెదడులో అమీలయిడ్ ప్లేక్స్ ను, నాడులను కప్పివేసినట్లుగా ఉన్న ఫైబర్లను, నాడుల మధ్య అనుసంధానం లేకపోవడాన్ని గుర్తించారు. ఇవే ఆమె సమస్యకు కారణమని గుర్తించారు. అందుకే ఈ వ్యాధికి ఆయన పేరు పెట్టారు అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.

 

లక్షణాలు ఇవి.

 జ్ఞాపకశక్తి నశిస్తుంది. కానీ... బాగా పాత ఘటనలు జ్ఞాపకాలు మాత్రం గుర్తుంటాయి. మాటల్లో తేడా, తడబాటు వస్తాయి. అనర్గళంగా మాట్లాడలేరు. ఒక పదానికి బదులు మరో పదం వాడతారు. ఇప్పుడే జరిగిన ఘటనలను వెంటనే మర్చిపోతారు. బయటకు వెళ్లిన సమయంలో ఇంటిదారి మరచి మరో మార్గంలో వెళ్తారు. ఏకాగ్రత లోపిస్తుంది. తెలియకుండా మూత్ర విసర్జన అయిపోతుంది.

 

బీపీతో జరభద్రం.

 కొందరికి బీపీ ఎక్కువగా ఉంటుంది. అది మనుషుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువ కాలం సరైన చికిత్స చేయించుకోకపోతే.. మెదడులోని రసాయనాల కూర్పులో మార్పులతో అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది.

 

నిర్ధారణ ఇలా.

 ఎమ్మారై, పెట్ స్కానింగ్ ద్వారా దీనిని గుర్తిస్తారు. రక్త పరీక్షలు చేసి కూడా నిర్ధారిస్తారు.

 

మెదడుకు పదును.. కంటికి నిద్ర..

బోర్డు గేములు ఆడటం, సుడోకు, పజిల్స్ వంటి వాటిని పూర్తి చేయడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోవాలి. దీని వల్ల జ్ఞాపక శక్తికి సంబంధించిన నరాలు నిర్వీర్యం కాకుండా ఉంటాయి. ఇష్టమైన పుస్తకాలు చదవాలి. మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉండాలి. మద్యం పొగ తాగటం మానేయాలి. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బి-12 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్యారెట్లు, ఆకుకూరలు, కూరగాయలు విరివిగా తీసుకోవాలి. రాత్రి సమయంలో తప్పనిసరిగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. వ్యాయామం, ధ్యానం, యోగా వంటి నిత్యం చేయాలి. ఉదయం పూట వాకింగ్ చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపాలి . బీపీ, షుగర్, థైరాయిడ్ బి-12 లోపం వంటి సమస్యలు ఉంటే వారిని నియంత్రణలో పెట్టుకోవాలి అని డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

 

పండ్లు, ఒమేగా-3 ఫ్యా టి యాసిడ్స్.

 పండ్లు ఎక్కువగా తినే వారికి అల్జీమర్స్ ముప్పు తక్కువ అని అమెరికాలో ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో తేలింది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని నిపుణులు అభిప్రాయం. చేపలు, తృణధాన్యాలు తరచుగా తీసుకుంటే మంచిది అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

 Editor  of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Related Posts

Latest News

రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!? రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?
రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?  ధర్మ చక్రం సంస్థ అధ్యక్షురాలు కుమారి యామినీ లక్ష్మీహైదరాబాద్ ఆగష్టు 9 (మీడియా ఫోకస్ న్యూస్ )వికారాబాద్ జిల్లా...
ఎసిబి వలలో భారీ తిమింగలం. 
ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా
సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..
క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు
తాను శాసనసభలో కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది.
సుప్రీం కోర్టు తీర్పు 20 ఏళ్లుగా పోరాటం విజయం