ప్రజల సంపద ఒక వర్గానికే పంపిణీ.

కాగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమవుతుంది.  కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆరోపణాస్త్రాలు.

ప్రజల సంపద ఒక వర్గానికే పంపిణీ.

ప్రజల సంపద ఒక వర్గానికే పంపిణీ.

కాగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమవుతుంది.

 కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆరోపణాస్త్రాలు.

 

జైపూర్ ఏప్రిల్ 23 (మీడియా ఫోకస్ );: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మరోసారి కాంగ్రెస్‌పై ఆరోపణాస్త్రాలు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత విశ్వాసాలను కొనసాగించడం కష్టమని అంటూ ప్రజల సంపదను లాక్కుని ఒక వర్గానికి పంపిణీ చేయాలని ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. చేశారు. కాంగ్రెస్ పాటనలో మత విశ్వాసాలను పాటించడం కూడా ప్రజలకు కష్టంగా మారుతుందని మంగళవారం రాజస్థాన్‌లోని టోంక్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఆయన ఆరోపించారు.కాగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమవుతుందని ఆయన ఆరోపించారు. దేశం హనుమాన్ జయంతి జరుపుకుంటున్న రోజున మోడీ నుంచి ఈ ఆరోపణలు రావడం గమనార్హం. రాజస్థాన్‌లోని బన్సారాలో ఒక ఎన్నికల ప్రచార సభలో తాను ప్రసంగిస్తూ ప్రజల సంపదను పంపిణీ చేయడంపై చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రస్తావిస్తూ తన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహం చెంది ప్రతి చోట తనను దూషించడం ప్రారంభించాయని చెప్పారు. మీ సంపదను లాక్కుని ఒక ఎఒపిక చేసిన కొందరు వ్యక్తులకు పంపిణీ చేయాలన్న లోతైన కుట్రను కాంగ్రెస్ రచిస్తోందన్న వాస్తవాన్ని మాత్రమే తాను బయటపెట్టానని మోడీ తెలిపారు.రెండు మూడు రోజుల క్రితం తాను కాంగ్రెస్ పార్టీ చేసే ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాల గురించి మాట్లాడానని, ఇది కాంగ్రెస్‌కు, ఇండియా కూటమికి ఆగ్రహం తెప్పించి మోడీని తిట్టడం ప్రారంభించాయని ఆయన తెలిపారు. నిజం మాట్లాడితే కాంగ్రెస్ ఎందుకు భయపడి తన విధానాలను దాచిపెడుతోందని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ప్రజల వద్ద ఉన్న సంపదపై సర్వే జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రాసిందని, సంపదపై ఎక్స్‌రే తీస్తామని ఆ పార్టీ నాయకుడే ప్రకటించాడని మోడీ తెలిపారు. మీ రహస్యాలు బట్టబయలు కావడంతో మీ రహస్య ఎజెండా బయటపడి వణుకుతున్నారని ఆయన కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది
బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది.   *ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ.. కేసీఆర్ కి ఆలోచన లేదు *ముందు చూపుతో హైదరాబాద్...
తెలంగాణ ఉద్యోగుల సంఘం, మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ బోనాల సంభరాలు.
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం
మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్ లో వివక్షకు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాను.
క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం
కోకాపేట వరకు రెండో దశలో మెట్రో రైలు