పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ.

పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ.

పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ.

 

 

అమరావతి ఏప్రిల్ 2 (మీడియా ఫోకస్ );ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో గత రెండు రోజులుగా పెన్షన్ల పంపిణీ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అలాగే ఎన్నికల విధుల్లో కూడా వలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.దీనిలో భాగంగానే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు, రోగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది.మూడు రోజుల పాటు గ్రామ, వార్డు, సచివాలయాల్లో పంపిణీ చేయాలని సూచించింది. ఆ తర్వాత నేరుగా ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించింది. సచివాలయాల వెల్ఫేర్ సెక్రటరీలు, పంచాయతీ అధికారులకు పెన్షన్లు డ్రా చేసేందుకు, పంపిణీకి ఆథరైజేషన్ లెటర్లు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ విడుదల చేశారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Related Posts

Latest News

నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో పీహెచ్డీ చేసిన సీఎం జగన్ రెడ్డి    నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో పీహెచ్డీ చేసిన సీఎం జగన్ రెడ్డి   
నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో పీహెచ్డీ చేసిన సీఎం జగన్ రెడ్డి .   నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో సీఎం జగన్ రెడ్డి పీహెచ్డీ చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ...
30 నామినేషన్ల తిరస్కరణ.. హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 11  ,అత్యధికంగా మల్కాజిగిరిలో 77
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?
ఈ నెల 26న ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ రాష్ట్రానికి రాక.
బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు
నేటి నుండి వేసవి సెలవులు.
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు.