టిడిపి లో చేరికల ఎఫెక్ట్: నెల్లూరు జిల్లానేతల ఇళ్లలో సోదాలు

టిడిపి లో చేరికల ఎఫెక్ట్: నెల్లూరు జిల్లానేతల ఇళ్లలో సోదాలు

టిడిపి లో చేరికల ఎఫెక్ట్: నెల్లూరు జిల్లానేతల ఇళ్లలో సోదాలు

 

 

నెల్లూరు మార్చ్ 4 (మీడియా ఫోకస్);వైసిపికి బలమైన జిల్లాల్లో నెల్లూరు ఒకటి. టిడిపి లో చేరికల ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లానేతల ఇళ్లలో పోలీసులు సోదాలు నిఎవహిస్తున్నరు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 15 చోట్ల పోలీసులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారన్న సమాచారంతోనే ఈ దాడులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. అటువంటి జిల్లా ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వైసీపీకి కీలకమైన నేతలు అంతా పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో వైసీపీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది. గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన చాలామంది నాయకులు పార్టీని వీడారు. అందులో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి బలమైన నేతలు కూడా ఉన్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈరోజు విపక్షటిడిపినేతల ఇళ్లను టార్గెట్ చేస్తూ పోలీసులు తనిఖీలు నిర్వహించడం విశేషం.

 

పోలీసులు సోదాలు చేస్తున్న టిడిపి నేత విజితా రెడ్డి నివాసానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రధానంగా మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసాలను పోలీసులు టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరికీ ఆర్థిక సాయం అందిస్తున్న ఫైనాన్సియర్ల ఇళ్లు కూడా తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవలే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఈయన నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. నెల్లూరు అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి నారాయణ పోటీ చేయనున్నారు. ఈ ఇద్దరు నేతలు ఆర్థికంగా బలవంతులే. దీంతో వైసీపీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది. అందుకే ఇక్కడ ఎంపీగా విజయసాయిరెడ్డి పేరును జగన్ ప్రకటించారు. ఇప్పటికే సీనియర్ నేతలు అందరూ వైసీపీని వీడారు. జూనియర్లతోనే రాజకీయం చేయాలని జగన్ భావిస్తున్నారు. అయితే టిడిపిని ఎన్నికల్లో దెబ్బతీయాలంటే.. నేతల మానసిక స్తైర్యంపై దెబ్బ కొట్టాలని భావించారు. అందులో భాగంగానే పోలీసులతో తనిఖీ చేయించినట్లు తెలుస్తోంది.

 

గత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. అటువంటిది నేతల చేరికలతో అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో జిల్లాలో టిడిపి బలం పెరిగింది. అటు ఆనం రామనారాయణరెడ్డి లాంటి సీనియర్ సైతం చేరడంతో గెలుపు పై నమ్మకం ఏర్పడింది. టిడిపి నేతలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుండడం.. నాయకత్వం సైతం ప్రోత్సహిస్తుండడంతో జిల్లా నేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే తనిఖీల పేరిట ప్రభుత్వం భయాందోళనకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ముంగిట ఈ తరహా ప్రయత్నాలకు భయపడమని.. జిల్లాలో పదికి పది స్థానాలు సాధిస్తామని టిడిపి నాయకులు చెబుతున్నారు.వైసిపికి బలమైన జిల్లాల్లో నెల్లూరు ఒకటి. గత రెండు ఎన్నికల్లో ఆ జిల్లా ఏకపక్షంగా నిలిచింది. 2019 ఎన్నికల్లో పదికి పది స్థానాలు వైసిపి దక్కించుకుంది.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

 Editor  of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Related Posts

Latest News

రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!? రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?
రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?  ధర్మ చక్రం సంస్థ అధ్యక్షురాలు కుమారి యామినీ లక్ష్మీహైదరాబాద్ ఆగష్టు 9 (మీడియా ఫోకస్ న్యూస్ )వికారాబాద్ జిల్లా...
ఎసిబి వలలో భారీ తిమింగలం. 
ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా
సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..
క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు
తాను శాసనసభలో కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది.
సుప్రీం కోర్టు తీర్పు 20 ఏళ్లుగా పోరాటం విజయం