పరువు నష్టం కేసులో తప్పును అంగీకరించిన కేజ్రీవాల్‌.

చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశం.

పరువు నష్టం కేసులో తప్పును అంగీకరించిన కేజ్రీవాల్‌.

పరువు నష్టం కేసులో తప్పును అంగీకరించిన కేజ్రీవాల్‌.

         చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశం.

 

న్యూ డిల్లీ ఫిబ్రవరి 26 (మీడియా ఫోకస్ );కేజ్రీవాల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఆ వీడియోను రీట్వీట్ చేయడం పొరపాటు అని, కేసును మూసివేయాలని కేజ్రీవాల్‌ కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు. కేజ్రీవాల్ తన తప్పును అంగీకరించినందున ఈ కేసులో ఫిర్యాదుదారుని సూచనను సుప్రీంకోర్టు కోరింది. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది రాఘవ్ అవస్తీ కూడా దీనికి అంగీకరించారు. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్‌ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.2018 పరువు నష్టం కేసు లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు ఊరట లభించింది. యూట్యూబర్‌ ధ్రువ్‌ రాథీ వీడియోను రీట్వీట్‌ చేసిన కేసులో కేజ్రీవాల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్‌ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.కాగా, యూట్యూబర్‌ ధ్రువ్‌ రాథీ 2018 మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఓ వీడియోను కేజ్రీవాల్‌ తిరిగి ట్వీట్‌ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్‌ కేసు దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుందని, అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దీనిపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం.
నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. అకాల వర్షాల వర్షంతో కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు.   నిజామాబాద్‌ ఏప్రిల్ 13 (మీడియా ఫోకస్ );: నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వర్షం...
బోర్న్ విటీ హెల్త్ డ్రింక్స్ కేటగిరి లోకి రాదు.
పాకిస్థాన్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు..
వైఎస్ షర్మిల పర్యటనలో ఉద్రిక్తత..
ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.
ఫ్యామిలీ వీసాకు వార్షిక ఆదాయ పరిమితిని 55 శాతానికి పెంపు.
గత నెల 16 నుంచి జిల్లాలో ఇప్పటి వరకు రూ.13,33,19,960 నగదు సీజ్