రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే కారణం.

పరిశుభ్రతే నులిపురుగులకు విరుగుడు: డాక్టర్ లిల్లీ మేరి .(నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం)

రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే కారణం.

రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే కారణం.

  పరిశుభ్రతే నులిపురుగులకు విరుగుడు: డాక్టర్ లిల్లీ మేరి

               (నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం)

 

సిద్దిపేట ఫిబ్రవరి 9 (మీడియా ఫోకస్ ): పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి రెడీ అయిన క్షణంలోనే కడుపునొప్పి అంటూ విల్లవిల్లాడుతారు. కొందరు తల్లిదండ్రులు బడి తప్పించుకోవడానికి అనుకుంటారు. మరికొందరు ఆకస్మాత్తుగా వచ్చే నొప్పిని చూసి గాబరా పడతారు. ఒక్కోసారి ఇది నులిపురుగుల వల్ల అయ్యి ఉండవచ్చు. పిల్లల ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండే తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేసే నులిపురుగులు తయారు కావడానికి ప్రధాన కారణం పరిశుభ్రత పాటించక పోవడమే అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు. నులిపురుగులతో ఒక్కోసారి ప్రాణాంతకమైన సమస్యలు కూడా వస్తాయి. రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే కారణం అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

        సంవత్సరం పిల్లవాడి నుండి 19 సంవత్సరాల యువకుడి వరకు పొట్టలో పెరిగే పురుగులతో బాధపడుతూనే ఉంటారు. నులిపురుగులు, కొరడా పురుగులు, కొంకి పురుగులు, బద్దె పురుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు లాంటివి మన పొట్టలు చేరి అనేక రోగాలకు కారణం అవుతుంటాయి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖున దేశవ్యాప్తంగా నేషనల్ డి వార్మింగ్ డే (జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం) గా జరుపుకుంటారు అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

 పిల్లల్లో తలెత్తే సమస్యలు:

 రక్తహీనత, ఆకలి మందగించడం, శారీరకంగా బలహీనులు కావడం, కడుపునొప్పి, వికారముగా ఉండడం, వాంతులు, విరోచనాలు, మలములో రక్తం రావడం, మానసిక ఆందోళన వంటి అనేక రకాల సమస్యలకు నులి పురుగులు కారణమవుతాయని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.

ఎలా వ్యాపిస్తాయి అంటే:

 నులిపురుగుల గుడ్లు మలము ద్వారా బయటకు వచ్చి మట్టిని కలుషితం చేస్తాయని, ఈ గుడ్లు మట్టిలో లార్వాలుగా ఉంది చెందుతాయని లిల్లీ మేరి అన్నారు. పిల్లలు మట్టిలో ఆడుకోవటం, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వలన ఈ గుడ్లు లార్వాలు వారి లోపలికి చేరుకుంటాయని, పిల్లల్లో చేరిన లార్వాలు, గుడ్లు, క్రిములుగా వృద్ధి చెందుతాయని, ఎదిగిన నులిపురుగులు తిరిగి గుడ్లును ఉత్పత్తి చేసి పిల్లలకు అనారోగ్యం కలిగిస్తాయని డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

ఒక్క మాత్రతో నులిపురుగులకు చెక్:

 తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా పిల్లల్లో నులిపురుగులు పెరగకుండా జాగ్రత్త పడవచ్చని ముఖ్యంగా పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రం తప్పనిసరిగా వేయాలని, ఈ మాత్రలను పంపిణీకై ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు అనగా ఫిబ్రవరి 10 మరియు ఆగస్టు 10వ తేదీల్లో ప్రత్యేకంగా గ్రామాలల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుందని, ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ఏవైనా కారణాలతో పాఠశాలలకు వెళ్ళని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలోనూ, 6 నుండి 19 సంవత్సరాల పిల్లలకు వారు చదువుకునే పాఠశాల ల్లో ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఈమాత్రలు వేస్తారని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

మాత్రలతో ప్రయోజనాలు ఎన్నో:

 ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడంతోపాటు వైద్యుల సూచనకు అనుగుణంగా ఆల్బెండజోల్ మాత్రలను క్రమం తప్పకుండా వెయ్యడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా నులిపురుగుల భారి నుండి పిల్లలను కాపాడవచ్చు. రక్తహీనత,,పోషకాహార లోపము వంటి సమస్యలు అధిగమించవచ్చు. పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. శారీరక, మానసిక పెరుగుదలతో పాటు వికాసం పెంపొందుతుంది. పనిచేయగలిగే సామర్థ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు గల వారికి మాత్రలు వేయరాదని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

 జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని, తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సహాయ ఆచార్యులు లిల్లీ మేరి తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయరాదు. భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తరువాత సబ్బుతో కాళ్లు, చేతులు కడుక్కోవాలి.

బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు ధరించేలా చూడాలి. పెరిగిన గోళ్ళను ఎప్పటికప్పుడు తొలగించాలి. చేతి వేళ్లలో మట్టి లేకుండా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. వేడి ఆహారం తీసుకోవడంతో పాటు ఆహారంపై ఎప్పుడు కప్పి ఉంచాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

ప్రధాన ఉపాధ్యాయులకు సూచనలు:

నులిపురుగుల నివారణకు మాత్రలు పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు సలహాలు, సూచనలు అందిస్తారని మాత్రను వేయడానికి వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. విద్యార్థులు మాత్రను నేరుగా మింగకుండా చప్పరించిన తర్వాత మిగిలిన మాత్రను మింగేలా చూడాలని లిల్లీ మేరీ అన్నారు. 6 నుంచి 18 సంవత్సరాల లోపు వారికి పూర్తి మాత్రను ఆరేళ్లలోపు వారికి సగం మాత్రను వేయాలని, సమీపంలోని ఆరోగ్య కేంద్రం ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని, కడుపులో నులిపురుగులు ఎక్కువగా ఉండే విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, తలనొప్పి, కడుపునొప్పి వంటి ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, అయితే వీటి వల్ల ఎలాంటి నష్టముండదని, వారిని కేవలం నీడలో కూర్చోబెడితే సరిపోతుంది అని, మాత్ర గొంతులో ఇరుక్కుపోయిన సందర్భంలో వారిని తొడలపై కూర్చోబెట్టుకొని వీపుపై మాత్ర బయటకు వచ్చేవరకు తట్టాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది
బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది.   *ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ.. కేసీఆర్ కి ఆలోచన లేదు *ముందు చూపుతో హైదరాబాద్...
తెలంగాణ ఉద్యోగుల సంఘం, మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ బోనాల సంభరాలు.
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం
మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్ లో వివక్షకు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాను.
క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం
కోకాపేట వరకు రెండో దశలో మెట్రో రైలు