థర్డ్ ఫ్రంట్ ప్రణాళికలో విప్లవాత్మకమైన ప్రగతిశీల అభివృద్ధికర 10 చట్టాలు

థర్డ్ ఫ్రంట్ ప్రణాళికలో విప్లవాత్మకమైన ప్రగతిశీల అభివృద్ధికర 10 చట్టాలు

థర్డ్ ఫ్రంట్ ప్రణాళికలో విప్లవాత్మకమైన ప్రగతిశీల అభివృద్ధికర 10 చట్టాలు

 

విజయవాడ ఫిబ్రవరి 9 (మీడియా ఫోకస్ ):దేశ సమగ్రత సమభావం సత్వర సుస్ధిర అభివృద్ధి నిర్మాణం కోసం, థర్డ్ ఫ్రంట్ ప్రణాళికలో విప్లవాత్మకమైన ప్రగతిశీల అభివృద్ధికర పదిచట్టాలను చేరుస్తున్నట్టు థర్డ్ ఫ్రంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీయేఫ్రంట్ ని వ్యతిరేకించడానికో లేక ఇండియా ఫ్రంట్ ని విమర్శించడానికో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేయలేదని ఆయన స్పష్టంచేశారు. ప్రజా ప్రయోజనాలు నెరవేర్చలేని ఎన్ని ఫ్రంట్లు ఉన్నా అవి నిరుపయోగమేనని ఆయన అన్నారు. మా థర్డ్ ఫ్రంట్ లో, ప్రజాప్రయోజనాల్ని నెరవేర్చడం తో పాటు ఇటు ప్రభుత్వ రంగాన్ని అటు ప్రైవేటు రంగాన్ని కూడా నూతన రాజకీయ ఆర్థిక విధానాలతోసమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి ఎజెండా అని, నూతన రాజకీయ ఆర్థికవిధానాలు మా విధానాలని అన్నారు. అన్నీ పార్టీలు ఫ్రంట్ లు, ఉచితాలు పథకాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రజలసమగ్రత సుస్థిర అభివృద్ధి కోసం సమాజానికి ఎంతో ఆరోగ్యకరమైన పది చట్టాలను తీసుకొస్తున్నామని వాటిని ఆయన వివరించారు.వ్యవసాయ రంగ పెట్టుబడులు, వ్యవసాయ రంగం, కామన్ మార్కెట్, అసంఘటిత రంగానికి ప్రోత్సాహాలు సంఘటిత రంగానికి సేవలు ప్రభుత్వ ఉద్యోగులకు నిర్ణీత తేదీకి ఒకసారి జీతాలు పెంపు, క్యాస్ట్ ఫీలింగ్, విలేజ్ టు మండల్ స్థాయి విద్యా విధానం, వృద్ధులువికలాంగులు వితంతులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ డాక్టర్ సిస్టం, మద్యపాన ఉపశమన చట్టం, లోకల్ బాడీ ఎలక్షన్లప్రణాళిక, ఆర్థిక సుస్థిరత సామాజిక అభివృద్ధి లాంటి మరికొన్న చట్టాలు పెరిగే అవకాశం ఉందని వాటిని కూడా ఇందులో చేర్చుతామనిఆయన తెలిపారు. ప్రజల్లోకి వెళ్లే ముందు ఈ 10 చట్టాలను, అనుభవజ్ఞులైన మేధావులతో బహిరంగంగా చర్చించి, అప్పుడు కలిసివచ్చే పార్టీలను కలుపుకొని ప్రజాక్షేత్రంలోకి వెళతామని ఆయన తెలిపారు. అప్పటివరకు ఈ థర్డ్ ఫ్రంట్ లోకి ఏ పార్టీల్నితీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టాలను విశ్లేషించడానికి సామాజిక రాజకీయ ఆర్ధిక రంగాలలో అనుభవజ్ఞులైనటువంటి,డాక్టర్ జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్, కత్తి పద్మారావు, జేడీ లక్ష్మీ నారాయణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,తెలకపల్లి రవి లాంటి సామాజిక విశ్లేషకులు మరి కొంతమందిని ఒకే వేదిక మీదకి ఆహ్వానించి ఈ చట్టాలపై చర్చిస్తామనితెలియజేశారు. ఈ కార్యక్రమంలో, లాల్ భీమ్ నేత కొప్పుల విజయబాబు, ఐపిసి నందమూరి ప్రసాద్, ఐపిసి కే.రమేష్,తోట సంఘమేశ్వరరావు కమ్యూనిస్ట్, కోండా సంజయ్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది
బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది.   *ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ.. కేసీఆర్ కి ఆలోచన లేదు *ముందు చూపుతో హైదరాబాద్...
తెలంగాణ ఉద్యోగుల సంఘం, మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ బోనాల సంభరాలు.
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం
మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్ లో వివక్షకు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాను.
క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం
కోకాపేట వరకు రెండో దశలో మెట్రో రైలు