రొమ్ము క్యాన్సర్ పై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలి : లిల్లీ మేరి

రొమ్ము క్యాన్సర్ పై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలి : లిల్లీ మేరి

రొమ్ము క్యాన్సర్ పై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలి : లిల్లీ మేరి

brest canser

 సిద్దిపేట డిసెంబర్ 14(మీడియా ఫోకస్ );రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన ఏర్పరచుకోవటం మహిళలకు ఎంతో అవసరమని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు. వ్యాధి ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ? ఎలాంటి లక్షణాలతో ఈ వ్యాధి బయటపడుతుంది అనే అంశాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు.

 

 పెంపొందించుకోవలసిన అవగాహన :

 రొమ్ములో నొప్పి లేని గడ్డలను నిర్లక్ష్యం చేయకూడదు. 18 ఏళ్ల నుంచే రొమ్ములను పరీక్షించుకుంటూ ఉండాలి. 30 ఏళ్ల పైబడిన తరువాత అల్ట్రాసౌండ్, డిజిటల్ మామోగ్రఫీ పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలతో గడ్డ చేతికి తగలని సైజులో ఉన్నప్పుడే కనుక్కోగలుగుతారు. లావుగా ఉండే మహిళలలో, పెద్ద రొమ్ములు కలిగిన వాళ్లకు మాత్రమే రొమ్ము క్యాన్సర్ వస్తుందనేది నిజం కాదు. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి తెలిపారు.

 

కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్ ఉంటే?

 ఫ్యామిలీ హిస్టరీలో రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటే, ఈ క్యాన్సర్ ముందుగానే పసిగట్టటానికి బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 జెనెటిక్ పరీక్షలు చేయించుకోవచ్చు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే వైద్యుల సూచన మేరకు ముందుగానే రొమ్ములను తొలగించుకోవడం లేదా పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండటం చేయాలి. మహిళ వయసు, పరీక్షా ఫలితాల ఆధారంగా తీసుకోవాల్సింన నిర్ణయం గురించి వైద్యులు నిర్ణయిస్తారని ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు.

 

వంశపారంపర్యమా?

 పెరిగే వయసుతో పాటు రిస్క్ కూడా పెరుగుతుంది. జెనెటిక్ కోడ్ ఆధారంగా కొన్ని కుటుంబాలలో ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువ. అలాగని ఫ్యామిలీ హిస్టరీలో లేని వాళ్లకు ఈ క్యాన్సర్ రాదని చెప్పలేము. కాబట్టి 30 ఏళ్ల మొదలు ప్రతి మహిళా రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన ఏర్పరచుకోవాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి తెలిపారు.

 

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:

 

 రొమ్ములో కనితి, రొమ్ములో, బహుమూలలో గడ్డలు లేదా వాపు, చనుమొన సైజులో మార్పు, మొనలు లోపలికి తిరిగి ఉండటం, రొమ్ము పై చర్మం మందముగా తయారవడం, రంగులో మార్పు, రొమ్ము మీద నయం కాని పుండు, చనుమొన నుంచి రక్తస్రావం. ఈ లక్షణాలు కనిపించే సమయానికి రొమ్ము క్యాన్సర్ తొలిదశ దాటిపోయే ప్రమాదం ఉంది. క్యాన్సర్ కనితి రకము, గ్రేడింగ్ ఆధారంగా సర్జరీ, కీమో, రేడియేషన్, హార్మోన్ థెరఫీ వంటి వాటిని వైద్యులు నిర్ణయిస్తారని ప్రిన్సిపాల్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

 

వీరికి ప్రమాదం ఎక్కువ!

 

 దగ్గరి బంధువుల్లో ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు (అమ్మ, అమ్మమ్మ, మేనత్త, అక్క, చెల్లెలు), వాళ్లు 40 ఏళ్ల కంటే చిన్న వయసులోనే క్యాన్సర్ కు గురైనప్పుడు, రెండు రొమ్ములు క్యాన్సర్ కు గురైన కుటుంబాలలో, కుటుంబానికి చెందిన పురుషులలో కూడా క్యాన్సర్ బయటపడినప్పుడు, కుటుంబ సభ్యులలో ఇతర క్యాన్సర్లు కనిపించడం లేదా అండాశయాల క్యాన్సర్ కు గురవటం, జీన్ ముటేషన్ బలంగా ఉండటం, పెళ్లి, పిల్లల విషయాల్లో ఆలస్యము, సంతానలేమికి హార్మోన్ల మందులు ఎక్కువగా వాడటం, పదేళ్ల కంటే చిన్న వయసులో రజస్వల కావటం, 50 ఏళ్లు పైబడిన నెలసరి ఆగకపోవడం, అధిక బరువు తోడవడం వంటి వాటి వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది
బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది.   *ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ.. కేసీఆర్ కి ఆలోచన లేదు *ముందు చూపుతో హైదరాబాద్...
తెలంగాణ ఉద్యోగుల సంఘం, మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ బోనాల సంభరాలు.
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం
మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్ లో వివక్షకు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాను.
క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం
కోకాపేట వరకు రెండో దశలో మెట్రో రైలు