కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

రాజ్యాంగ బద్దమైన మండల్ కమిషన్ సిపార్సులు అమలు చేయాలి         ఉప రాష్ట్రపతితో బీసీ సంఘాల నేతలు భేటి

కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

  రాజ్యాంగ బద్దమైన మండల్ కమిషన్ సిపార్సులు అమలు చేయాలి

        ఉప రాష్ట్రపతితో బీసీ సంఘాల నేతలు భేటి

న్యూ డిల్లీ అక్టోబర్ 21 (మీడియా ఫోకస్ న్యూస్ );కేంద్ర ప్రభుత్వంలో బీసీల సంక్షేమం అభివృద్ధి పరచడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనిఅలాగే రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ మిగతా సిఫార్సులు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులురాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో నేడు ఉప రాష్ట్రపతి జగదీప్ దనకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య కేంద్రంలో 74 మంత్రిత్వ శాఖలు ఉన్నవి అలాగే ఎస్సీలకుఎస్టీలకుమైనారిటీలకుమహిళలకు కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నవి. కానీ 56% జనాభా గల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడంతో బీసీ కులాల అభివృద్ధి కుంటుపడుతుంది. 75 సంవత్సరాల తర్వాత ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖ పెట్టకపోవడం అన్యాయం జరుగుతున్దని ఉప రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.అలాగే రాజ్యాంగబద్ధమైన మండల కమిషన్ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందని, అన్ని రాజకీయ పార్టీలుబీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయ మని పేర్కొన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వలన బీసీల విద్యాఉద్యోగఆర్ధికరాజకీయపరమైన స్కీములు అమలు చేయలేకపోతున్నారన్నారు. కేంద్ర స్థాయిలో బీసీలకు విద్యఉద్యోగ రంగాలలో 27% రిజర్వేషన్లు 30 సంవత్సరాల నుండి అమలు చేస్తున్నారు. కానీ ఇతర ఆర్థికపరమైన స్కీములు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ ల మంజూరుహాస్టళ్ళ మంజూరుగురుకుల పాఠశాలల మంజూరులాంటి స్కీములు లేవు. ఈ స్కీములు మంజూరు చేసి బిసి లను  విద్యారంగంలో ఉన్నత చదువులు చదువుకోవడానికి  ప్రోత్సహించాలనిఅందుకు ఉపరాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. కులవృత్తులు పోయి పరిశ్రమలుకంపెనీలు వస్తున్నాయి. ఈ కులాలకు ప్రత్నామాయ  ఉపాధి కల్పించడానికి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే బీసీ అభివృద్ధికి కేంద్ర బడ్జెటులో ప్రతి సంవత్సరం 2లక్షల కోట్లు కేటాయించాలని కోరారు.జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులకు వర్తింపజేయాలనిదేశంలోని ప్రతి యూనివర్సిటీలో పరిశోధనాత్మక విద్యార్థులకు 50 మంది రాజీవ్ ఫెలోషిప్ పథకాన్ని అమలు చేయాలనిచట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ జగదీప్ దనకర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఉన్నారు.ఉప రాష్ట్రపతి ని కలిసిన వారిలో దక్షిణ భారత సంఘం అధ్యక్షులు జబ్బాల శ్రీనివాస్జాతీయ ఓబీసీ సంఘం అధ్యక్షులు  ఏ. వరప్రసాద్జాతీయ నేతలు మెట్ట చంద్రశేఖర్, కే మోక్షిత్సున్నం మల్లికార్జున్ఓం ప్రకాష్ మరియు భద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?    తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా! ..‘ప్రజాగళం’లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో నిలదీసిన చంద్రబాబు   శ్రీకాకుళం ఏప్రిల్...
ఈ నెల 26న ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ రాష్ట్రానికి రాక.
బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు
నేటి నుండి వేసవి సెలవులు.
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు.
విజయ లక్ష్మీ వెంకటేశ పుస్తక ఆవిష్కరణ
సంక్షేమ విద్యార్ధి వసతి గృహాల అద్దెలను విడుదల చేయండి.