
అఙాత చరిత్ర కారుల పై అధ్యయనం జరగాలి
చరిత్రకారులు అంజయ్య, డా. భిన్నూరి మహేశ్వరి.
అఙాత చరిత్ర కారుల పై అధ్యయనం జరగాలి
చరిత్రకారులు అంజయ్య, డా. భిన్నూరి మహేశ్వరి.
హైదరాబాద్ ఏప్రిల్ 24 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);కర్మభూమిలో పుట్టినందుకు మన చరిత్ర ను మనమే అధ్యయనం చేసుకొని మాతృభూమి ఋణం తీర్చుకోవాలి అని చరిత్ర శాఖాధిపతి,చరిత్రకారుడు అంజయ్య పిలుపు నిచ్చారు.మన సంస్కృతి సంప్రదాయాలను రెడ్డి రాజులు కాపాడిన తీరు గమనార్హమన్నారు. చరిత్రకారుడు అంజయ్య అన్నారు.దక్షిణా పధ స్టడీస్ ఆధ్వర్యంలో అజ్ఞాత చారిత్రక వీరులపై ఉపన్యాసాల శీర్షిక్షలో రెండవ ఉపన్యాసంగా "రెడ్డి రాజులు " అనే అంశం పై చరిత్ర శాఖాధిపతి , అంజయ్య ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. రెడ్డి రాజులు దాదాపు వంద సంవత్సరాలకు పైగా పరిపాలించారనీ వారి యుద్దాలు విజయాలు వంటి చర్వితచరణ చరిత్ర కాకుండా, ఆ కాలపు సాహిత్యం గమనిస్తే మనకు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి అనీ, మనం చరిత్రను చూసే దృక్కోణం లో మార్పు వస్తుందనీ, రావాలనీ అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను రెడ్డి రాజులు కాపాడిన తీరు గమనార్హం అనీ వ్యాపార ఎగుమతుల కోసం రెడ్డి రాజులు ఓడరేవుల ను ఎలా అభివృద్ధి చేశారో ఇంకొంత అధ్యయనం జరిగితే బాగుంటుందీ అని అభిప్రాయపడ్డారు.అనంతరం సురభారతి సమావేశ మందిరం లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డా. భిన్నూరి మహేశ్వరి మాట్లాడుతూ, తెలంగాణ చరిత్ర, ఆంధ్ర చరిత్ర, భారతీయ చరిత్ర మొత్తంగా గమనిస్తే అనేక మంది అజ్ఞాత వీరులు మనకు కనిపిస్తారని ఈ విషయం పై ఉపన్యాసాలు మంచి ప్రారంభమనీ పేర్కొన్నారు.. అఙాత చరిత్ర కారుల పై అధ్యయనం జరగాలి అని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణా పధ స్టడీస్ అధ్యక్షులు డా. గోపాల్ రెడ్డి గారు, పరిశోధన విభాగం కో-ఆర్డినేటర్ కళ్యాణచక్రవర్తి, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విధ్యార్ధిని విధ్యార్ధులు, చరిత్ర అధ్యయన కారులు అనేకమంది పాల్గొన్నారు. డా. లక్ష్మీ నారాయణగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
About The Author

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and seniour journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.
Latest News
